సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో అంటే ఇంకో హీరో కి పడదు అని అందరూ అనుకుంటారు కానీ ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి మారిపోయింది ఒక హీరో ఫంక్షన్ కి ఇంకో హీరో రావడం అనే విషయాన్ని పక్కన పెడితే స్టోరీ నచ్చితే వాళ్ల సేఫ్ జోన్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా హీరో లు ముందుకు వస్తున్నారు…ఇక ఈ విషయం లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందు వరుసలో ఉంటాడు.

ఇక ఈ రోజు రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి ( Bro movie )ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది…ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ నటన సూపర్ గా ఉందని చెప్తున్నారు ఇక ఈ సినిమా ని ఇప్పటికే చాలా మంది పెద్ద హీరోలు కూడా చూసినట్టు గా తెలుస్తుంది అందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని…నిజానికి ఇద్దరు కూడా బాగా చేశారు.

ఇక ఈ సినిమాని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రిలీజ్ చేసే సినిమా ఏంటి అని అందరిలో చర్చలు నడుస్తున్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి కాబట్టి వాటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది అప్పుడెప్పుడో స్టార్ చేసిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) పరిస్థితి ఏంటి అని ఇప్పటికే ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి టైం లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చే భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక సుజీత్ డైరెక్షన్ లో వచ్చే సినిమా మీద అయితే జనాల్లో చాలా మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చూడాలి ఇంకా కొన్ని నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ కి ముందే ఈ సినిమాలు అన్ని రిలీజ్ అవ్వాలి అని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…








