'బ్రో' షూట్ మొత్తం పూర్తి.. సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

జులై నెల వచ్చేసింది.ఈ నెల కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Bro Finished The Final Leg Of The Shoot, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dha-TeluguStop.com

ఎందుకంటే ఇదే నెలలో పవర్ స్టార్ నటించిన కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.

మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరుస అప్డేట్ లను అందిస్తూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు.

అందుకే ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెర మీద చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇదే నెలలో రిలీజ్ ఉండడంతో ఎప్పుడు షూట్ పూర్తి అవుతుందా అని అంతా ఎదురు చూసారు.కానీ ఇది ఇప్పటి వరకు పూర్తి కాలేదు.

అయితే ఈ సినిమా షూట్ గురించి తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు

తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసిన ఈ సినిమా షూట్ గురించి సాయి తేజ్ పోస్ట్ చేస్తూ.షూట్ మొత్తం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తెలిపారు.

ఇటీవలే ఈ సినిమాలోని సాంగ్ షూట్ కోసం మేకర్స్ ఇటీవలే విదేశాలకు వెళ్లారు.ఆస్ట్రియాకు వెళ్లగా అక్కడ షూట్ మొత్తం పూర్తి అయినట్టు అలాగే టోటల్ ఫినిష్ అయినట్టు సాయి తేజ్ చెప్పుకొచ్చాడు.

దీంతో రిలీజ్ కు ఎటువంటి అడ్డం లేకుండా పోయింది.

అయితే రిలీజ్ కు తక్కువ సమయం ఉండడంతో ఈ గ్యాప్ లోనే వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయనున్నారు.సాంగ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.చూడాలి ఈ సినిమాతో మామ అల్లుడు ఎలా అలరిస్తారో.

ఇక సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, ( Priya Prakash Varrier ) కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.కాగా ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube