బ్రిటిష్ వాళ్లు( British ) మన దేశాన్ని 200 ఏండ్లకుపైనే పరిపాలించారనే విషయం అందరికీ తెలిసినదే.1947లో వారు మనకి స్వతంత్రం( Independance ) ఇస్తూ తిరిగి వారి దేశానికి పోతూ.ఎన్నో గుర్తులను, జ్ఞాపకాలను ఇక్కడ వదిలేసి పోయారు.మన ఆహార అలవాట్లు, కల్చర్, రాజ్యాంగం వరకు అన్నింటిలోనూ వాళ్ల మార్క్ ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనబడుతోందంతే మీరు నమ్మితీరాల్సిందే.
ముఖ్యంగా మన ఫుడ్‌పై( Food ) బ్రిటిషర్ల ఎఫెక్ట్ చాలా ఉంది.అవును, విదేశీయులు మనల్ని పాలించడం వల్ల మనదేశంలో కొత్త వంటకాలు పుట్టుకొచ్చాయి.మసాలాల వాడకం నుంచి ఇప్పుడు మనం తింటున్న కూరగాయలు, పండ్ల వరకు అన్నింటిపై వాళ్ల ఎఫెక్ట్ ఉందనే చెప్పుకోవాలి.

బ్రిటిషర్స్ కాలంలోనే ఎక్కువగా ఇక్కడ ఆంగ్లో-ఇండియన్ వంటకాలు( Anglo-Indian Food ) పుట్టుకొచ్చాయి.బ్రిటిష్ వాళ్లు మన దేశానికి సముద్ర మార్గంలో వచ్చేటప్పుడు వాళ్లు వెంట తెచ్చుకున్న కూరగాయలు, ఫుడ్ జర్నీలోనే అయిపోయేవి.వాళ్ల రెగ్యులర్ ఫుడ్‌లో భాగమైన ఆలుగడ్డలు, క్యారెట్లు, కాలీఫ్లవర్లు ఇక్కడ దొరికేవి కావు.
దాంతో కొన్నాళ్లకు వాళ్ల కూరగాయలను మన భూమిలో పండించడం మొదలు పెట్టారు.అప్పుడు మనవాళ్లు ఆ కూరగాయలను మన స్టైల్‌లో వండడం మొదలు పెట్టారు.
అలా ఆంగ్లో- ఇండియన్ ఫుడ్ పుట్టింది.ముఖ్యంగా 1757 నుండి 1857 మధ్య ఇలాంటి భారీ మార్పులు ఆహారంలో చోటుచేసుకున్నాయని చరిత్ర కారులు చెబుతారు.

బ్రిటిషర్లు రుచికరమైన వంటకం ఏది చేయాలన్నా మసాలాలు( Spices ) గట్టిగా పడాల్సిందే.అందుకే వాళ్లు మసాలాల కోసం ఇండియాకు వచ్చారు.వాళ్ల వల్లే అనేక రకాల మసాలాలు మన వంటకాల్లో కూడా చేరినట్టు తెలుస్తోంది.మిరపకాయ, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు లాంటివన్నీ బ్రిటిష్ వాళ్ల వల్లే మనం వంటల్లో వేసుకోవడం స్టార్ట్ చేశామని చాలామందికి తెలియదు.
ఇప్పుడు మార్కెట్లో లభించే కొన్ని రకాల కూరగాయలు( Vegetables ) మనవి కావంటే మీరు నమ్ముతారా? ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ల వల్లే మన దేశానికి వచ్చిన ఆలుగడ్డలను( Potatoes ) ఎన్నో రకాల వంటల్లో వాడుతున్నాం.అంతెందుకు ప్రతి కూరలో వేసే టొమాటోలు( Tomatoes ) కూడా బ్రిటీష్‌వాళ్లు తీసుకొచ్చినవే.
ఇపుడు మనం టొమాటో లేని కూరను వూహించుకోలేము.అవి మాత్రమే కాకుండా….
గుమ్మడికాయ, క్యారెట్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా విదేశీ కూరగాయలే.అయితే.
ఇప్పటికీ చాలామందికి ఈ కూరగాయల అసలు మూలం ఇంగ్లండ్ అనే విషయం తెలియదు.







