YouTube: ఎలన్‌ మస్క్‌ వీడియోలు ఓపెన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు.అతడు ఎంతమందికో రోల్ మోడల్.

తాజాగా ట్విట్టర్ కొనుగోలు చేసే క్రమంలో ఎలాన్ మాస్క్ తరచూ న్యూస్ లో కనబడిన సంగతి తెలిసినదే.ఇకపోతే అతని అనుచరులు ఆయని పాఠాలను తూ చ పాటిస్తూ వుంటారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ఎలన్‌ మస్క్‌ చెప్పే క్రిప్టో ప్రిడిక్షన్స్‌ మీద ఆధారపడుతూ వుంటారు.అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అతని వీడియోలు యూట్యూబ్ లో వింటూ వుంటారు.

ఇక దీన్నే టార్గెట్ చేస్తున్నారు హేకర్స్.అవును, ఆయన పేరు మీదున్న యూట్యూబ్‌ వీడియోలు, ట్విట్‌ లింక్స్‌ ఓపెన్‌ చేస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త.సైబర్‌ నేరస్తులు ఎలన్‌ మస్క్‌ ఫోటోలు, వీడియోలు చూపించి.

Advertisement

బొమ్మ చూపెడుతున్నారు.సైబర్‌ నేరస్తులు రానురాను తెలివి మీరిపోతున్నారు.

ఎలన్‌ మస్క్‌ ఫోటోల్ని, వీడియోల్ని చూపించి అమాయకుల్నే కాదు బ్రిటిష్‌ ఆర్మీని సైతం మోసం చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.గార్డియన్‌ రిపోర్ట్‌ ప్రకారం.

బ్రిటిష్‌ ఆర్మీకి చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్తులు వాటి పేర్లను మార్చారు.

ఇకపోతే, యూట్యూబ్‌లో సైతం ఎలన్‌ మస్క్‌ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన వీడియోల్ని టెలికాస్ట్‌ చేశారు.ఎలన్‌ మస్క్‌ చెప్పినట్లు చేస్తే క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాల్ని గడించవచ్చని నమ్మబలుకుతున్నారు.దీంతో అప్రమత్తమైన బ్రిటిష్‌ ఆర్మీ దేశ ప్రజలకు క్షమాణలు చెప్పుకోవలసి వచ్చింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

హ్యాకింగ్‌ జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది.ప్రస్తుతం హ్యాకింగ్‌ ఎవరు చేశారు.

Advertisement

ఎక్కడి నుంచి చేశారనే అంశంపై బ్రిటిష్‌ ఆర్మీ విచారణ చేపడుతోంది.

తాజా వార్తలు