జలియన్ వాలాబాగ్ మారణహోమం: భారత్‌కు బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే ... యూకే ఎంపీ డిమాండ్

భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ మారణహోమానికి సంబంధించి భారత ప్రభుత్వానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాలని యూకే ఎంపీ డిమాండ్ చేశారు.

కామన్‌వెల్త్ డే సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన చర్చలో స్కాటిష్ నేషనల్ పార్టీకి (ఎస్ఎన్‌పీ) చెందిన ఎంపీ స్టీవెన్ బోనార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తాము విన్నట్లుగా కామన్‌వెల్త్ అనేది భాష, సంస్కృతి, విలువలు, బలమైన సంబంధాలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నెట్‌వర్క్ అని స్టీవెన్ అన్నారు.కామన్‌వెల్త్ వలసవాదం కూడా లోతైన మూలాలను కలిగి వుందని చెప్పారు.

అయితే విమర్శకులు మాత్రం ఈ కామన్‌వెల్త్ అనేది.బ్రిటన్ సామ్రాజ్య మారణహోమాలు, దోపిడి, ఆధిపత్యం, అణచివేతలకు గుర్తుగా వ్యాఖ్యానిస్తున్నారని బోనార్ అన్నారు.

వీటికి సంబంధించి అధికారిక క్షమాపణ కోసం కామన్‌వెల్త్ దేశాలు ఇంకా ఎదురుచూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 1919 నాటి జలియన్ వాలాబాగ్ ఘటనను వందేళ్ల తర్వాత బ్రిటన్ మారణకాండ జరిగినట్లుగానే అంగీకరించిందని స్టీవెన్ చెప్పారు.

Advertisement

ఈ ప్రభుత్వం భారతదేశానికి, అమృత్‌సర్ ప్రజలకు అధికారికంగా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.

2019 ఏప్రిల్‌లో జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి వందేళ్లు గడిచిన సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఇది బ్రిటీష్ ఇండియన్ చరిత్రపై మాయని మచ్చగా పేర్కొన్నారు.కానీ గత ప్రధానుల మాదిరిగానే థెరిస్సా మే కూడా ఈ ఘటనకు క్షమాపణలు చెప్పలేదు.

కాగా.భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది.

నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఓ తోట.వైశాఖీ పర్వదినం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు.అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధులు సైతం పాల్గొన్నారు.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం జలియన్ వాలాబాగ్‌లోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు.తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రవేశ మార్గాలను మూసివేసి.

జనంపై తూటాల వర్షం కురిపించారు.ఈ ఘటనలో 379 మంది మరణించారని బ్రిటీష్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు.ఇంతటి మారణహోమానికి కారణమైన జనరల్ డయ్యర్‌పై పగబట్టిన సర్దార్ ఉదమ్ సింగ్.

ఆయనను కొన్నేళ్లపాటు వెంటాడి లండన్‌లో కాల్చిచంపారు.ఈ నేరానికి గాను ఉదమ్ సింగ్‌ను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది.

తాజా వార్తలు