ప్రభుత్వం నూతన జిల్లాలు ప్రకటించిన నేపథ్యంలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా గా ఏర్పాటు చేయడం తో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చేస్తున్న ఆరోపణల పై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.పాలన వికేంద్రీకరణ చేపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తినీ శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించారు.
గత ప్రభుత్వంలో హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.
మీ బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పుట్టపర్తికి ఎమ్మెల్యే గా,మంత్రిగా పల్లె రఘునాథ్ రెడ్డి పని చేశారు.
అప్పుడు హిందూపురం ను ఎందుకు జిల్లాగా తెచ్చుకోలేక పోయారు.వచ్చే ఎన్నికల్లో కనీసం 16 సీట్లు కూడా మీరు తెచ్చుకోలేరు.వచ్చే 30 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా కొనసాగుతారు.







