బ్రేకింగ్:  కడప యురేనియం కర్మాగారంలో  భారీ అగ్నిప్రమాదం..!!  

kadapa,uranium factory fire accident,thumannapalle,kadapa district - Telugu Kadapa, Kadapa District, Thumannapalle, Uranium Factory Fire Accident

కడప జిల్లా తుమ్మనపల్లెలోని  యురేనియం కర్మాగారంలో  శుక్రవారం రాత్రి  భారీ అగ్నిప్రమాదం  సంభవించింది.  ఇండస్ట్రీలో కెమికల్ విభాగంలో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో… అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.

దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.కాగా మంటలు ఒక్కసారిగా ఎగిసి పడటంతో ఇండస్ట్రీ లో పనిచేస్తున్న కార్మికులు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.కానీ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడమే కాక వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.ఇదిలా ఉంటే ఒక్కసారిగా కర్మాగారంలో అంత పెద్ద ఎత్తున మంటలు రావడానికి గల కారణం ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#UraniumFactory #Kadapa #Kadapa District #Thumannapalle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు