బ్రేకింగ్: కడప యురేనియం కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం..!!
TeluguStop.com
Span Style="font-weight: 400"కడప జిల్లా తుమ్మనపల్లెలోని యురేనియం కర్మాగారంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇండస్ట్రీలో కెమికల్ విభాగంలో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో.
అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు./span """/" /
Span Style="font-weight: 400"దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా మంటలు ఒక్కసారిగా ఎగిసి పడటంతో ఇండస్ట్రీ లో పనిచేస్తున్న కార్మికులు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కానీ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడమే కాక వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉంటే ఒక్కసారిగా కర్మాగారంలో అంత పెద్ద ఎత్తున మంటలు రావడానికి గల కారణం ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.