తాజాగా బ్రెజిల్‌లో డైనోసార్( Dinosaur in Brazil ) పాదముద్రలను ఒక పూజారి కనుగొన్నారు.ఆ ప్రీస్ట్ పేరు మీదనే ఈ కొత్త డైనోసార్ జాతికి పేరు పెట్టారు.
ఆ పాదముద్రలు 125 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన చిన్న, వేగవంతమైన మాంసాహారి అయిన ఫార్లోవిచ్నస్ రాపిడస్‌కు( Pharlowichnus rapidus ) చెందినవి.ఈ ప్రీస్ట్ పేరు గియుసేప్ లియోనార్డి.
ఆయన 1980లలో బ్రెజిల్‌లోని పురాతన ఇసుకరాళ్ళ ప్రాంతమైన బోటుకాటు నిర్మాణాన్ని కూడా కనిపెట్టారు.అక్కడ చాలా డైనోసార్ పాదముద్రలను కనుగొన్నారు.
తదుపరి అధ్యయనం కోసం వాటిని మ్యూజియం ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు( Museum of Earth Sciences ) విరాళంగా ఇచ్చారు.శాస్త్రవేత్తలు పాదముద్రలను ఇతర తెలిసిన డైనోసార్ ట్రాక్‌లతో పోల్చారు.
తద్వారా అవి ప్రత్యేకమైనవని కనుగొన్నారు.వాటి ప్రకారం ఆ డైనోసార్ చురుకైనదని, ఎడారి వాతావరణానికి అనుగుణంగా ఉందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.
ఎందుకంటే ఇది పొడవాటి, సన్నని కాలి వేళ్లు, విశాలమైన స్ట్రైడ్‌ను కలిగి ఉంది.

సైంటిస్ట్స్ కొత్త జాతికి ఫార్లోవిచ్నస్ రాపిడస్ ( Pharlowichnus rapidus )అని పేరు పెట్టారు, దీని అర్థం “ఫాస్ట్ ఫార్లోస్ ట్రాక్”.డైనోసార్ పాదముద్రల స్టడీలో ప్రఖ్యాత నిపుణులైన జేమ్స్ ఫార్లో గౌరవార్థం ఈ జాతికి ఫార్లో అని పేరు పెట్టారు.రాపిడస్ అంటే లాటిన్‌లో “వేగవంతమైనది”, డైనోసార్ వేగాన్ని ప్రతిబింబిస్తుంది.

ఫార్లోవిచ్నస్ రాపిడస్ ఒక సీరీమా పక్షి పరిమాణం లేదా 60-90 సెం.మీ (2-3 అడుగులు) పొడవు ఉంటుంది.ఫార్లోవిచ్నస్ రాపిడస్ ఆవిష్కరణ పురాతన డైనోసార్ల వైవిధ్యం, ప్రవర్తనను తెలియజేస్తోంది.ఈ పాదముద్రలు భూమి గ్రహం గతంలోకి తీసుకెళ్తున్నాయి.ఈ ఆవిష్కరణ జర్నల్ క్రెటేషియస్ రీసెర్చ్‌లో ప్రచురించబడింది.తాజాగా కనుగొన్న పాదముద్రలు ఇప్పటిదాకా బయటపడిన డైనోసార్ పాదముద్రల కంటే భిన్నంగా ఉన్నాయని బ్రెజిల్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది.
పాదముద్రల మధ్య ఉన్న పెద్ద దూరం డైనోసార్ చాలా వేగంగా ఉన్నట్లు చూపించిందని వారు చెప్పారు.







