ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో ట్రీలింగ్ కు గురై సక్సెస్ సాధించిన సినిమాలలో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.అయితే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిందని మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.రణ్ బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.కరణ్ జోహార్ తన ట్విట్టర్ లో ప్రేమ, వెలుగు కలిసి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయని రెట్టింపు ఉత్సాహంతో రెండో వారంలోకి ప్రవేశిస్తున్నామని చెప్పుకొచ్చారు.
విదేశాల్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోందని సమాచారం అందుతోంది.
తెలుగులో ఈ సినిమా బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే.
అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కు మంచి మార్కులు పడ్డాయి.బ్రహ్మాస్త్ర సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడుతున్నాయి.

బ్రహ్మాస్త్ర ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఫ్యాన్స్ సంతృప్తితో ఉన్నారు.అయితే బ్రహ్మాస్త్ర పార్ట్2 దిశగా అడుగులు పడతాయో లేదో చూడాల్సి ఉంది.బ్రహ్మాస్త్ర కమర్షియల్ గా సక్సెస్ సాధించినా ఆడియన్స్ కు ఈ సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.







