బ్రహ్మానందం అతడి మొహం చూస్తే చాలు కడుపుతో నవ్వేస్తూ ఉంటారు చాలామంది.మీమర్స్ కి అతడు ఒక దేవుడు లాంటి వ్యక్తి.
బ్రహ్మానందం( Brahmanandam ) ని గాడ్ ఆఫ్ ద మీమ్స్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ 90వ దశకంలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు.
అత్యంత ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( Guinness World Records ) లో కూడా ఎక్కాడు బ్రహ్మానందం.ఎన్నో ఏళ్లుగా బ్రహ్మానందం నీ అందరూ ఒక మీడియం గానే చూస్తూ వస్తున్నారు కానీ చాలా మందికి తెలియదు ఏమిటి అంటే బ్రహ్మానందంలో కూడా ఒక సీరియస్ నటుడు ఉన్నాడు.
20, 30 ఏళ్ల క్రితం అయితే బ్రహ్మానందం కోసం సెపరేట్ గా ఎన్నో కామెడీ ఎపిసోడ్స్ రాసేవారు అప్పటి రచయితలు.దర్శకులు కూడా ఎన్ని రోజులు అయినా సరే వెయిట్ చేసి బ్రహ్మానందం కోసం సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి.ఇక కుటుంబ కథ కామెడీ చిత్రాలకు బ్రహ్మానందం గారు పెట్టింది పేరు.ఒక పెదరాయుడు సినిమా( Pedarayudu ) చూస్తే లేదా అబ్బాయిగారు వంటి సినిమా చూస్తే బ్రహ్మానందం గారు లేని కామెడీ ఊహించలేము.
కోడలు గారు పెద్ద కంచు లా ఉన్నారు అంటూ జయచిత్ర తో ఆయన చేసిన కామెడీ చాలా బాగా పండింది అబ్బాయిగారు సినిమాలో.ఇక చాలా సినిమాల్లో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి నటీనటులతో కాంబినేషన్ సీన్స్ కూడా ఆయన కెరియర్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
అయితే ఎంతగా కామెడీ చేసిన నవ్వించేవారు అంతే సీరియస్గా ఏడిపించగలిగిన సత్తా బ్రహ్మానందం కి ఉంది అన్నంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమ్మ సినిమా( Amma )లో బ్రహ్మానందం ఒక సీన్ లో చిన్న పిల్లలకు కథలు చెబుతూ నవ్విస్తూనే మరోవైపు ఏడిపిస్తూ ఉంటారు.ఇక రాజశేఖర్ హీరోగా నటించిన అన్న సినిమాలో కూడా బ్రహ్మానందం ఎడిపిస్తునే ఉంటాడు తన ఎమోషన్ తో.ఎంత కామెడీ చూసినా కూడా ఒక్కోసారి ఈ సినిమాలను చూస్తే బ్రహ్మానందం గారిని ఇంకా సీరియస్ పాత్రల్లో చూపించి ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది.ఇక ఎప్పుడు దర్శకుడు కృష్ణవంశీ తీస్తున్న రంగం మార్తాండ సినిమాలో చక్రి అనే పాత్రలో నటిస్తున్నారు బ్రహ్మానందం.