కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మానందం( Brahmanandam ) లేని సినిమా ఉండేది కాదు.దాదాపు అందరు స్టార్ హీరోలు తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాల్సిందే అంటూ పట్టుబట్టేవారు.
అలాంటి పరిస్థితుల నుంచి బ్రహ్మీ ఆఫర్లు లేని పరిస్థితికి వచ్చారు.ఏడాదికి వంద సినిమాల్లో నటించిన ఘన కీర్తిని సొంతం చేసుకున్న బ్రహ్మానందం ఇప్పడు కనీసం నాలుగు, అయిదు సినిమాల్లో కూడా కనిపించని పరిస్థితి.
ఇలాంటి సమయంలో బ్రహ్మానందం ను తప్పుబట్టకుండా ఆయన కోసం పాత్రలు రాయని, ఆయన కోసం కథ లు రాయని దర్శకులపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ విషయానికి వస్తే తాజాగా వచ్చిన కీడా కోలా సినిమా( Keedaa Cola ) లో బ్రహ్మానందం కు మంచి పాత్ర దక్కింది.

ఆయన మంచి పాత్ర వస్తే ఏం చేస్తాడో నిరూపించాడు.అదే జరిగింది.బ్రహ్మానందం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.కీడా కోలా సినిమాకు మంచి టాక్ వచ్చింది.కనుక సినిమా లోని ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.బ్రహ్మానందం తో మంచి పాత్రలు వేయిస్తే ప్రేక్షెకులు నచ్చుతారు.
ప్రేక్షకులు ఆధరిస్తారు.అందుకే దర్శకులు అంతా కూడా కీడా కోలా దర్శకుడు తరుణ్ భాస్కర్( Tharun Bhascker ) ను ఆదర్శంగా తీసుకుని ఇక పై బ్రహ్మానందం కు అవకాశాలు ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు.
స్టార్ హీరోల సినిమా ల్లో బ్రహ్మీ ఉంటే కచ్చితంగా అదనపు బలం అవుతుంది.

కనుక పెద్ద దర్శకులు, చిన్న దర్శకులు అంతా కలిసి ఈ విషయమై ఒక సారి ఆలోచిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మానందం మరో పదేళ్ల పాటు వరుస సినిమాలు చేయగల సత్తా ఉన్న వ్యక్తి అంటూ నెట్టింట ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అయితే బ్రహ్మీ కి ఈ వయసు లో విశ్రాంతి అవసరం.
ఆయన నటించినా నటించకున్నా కూడా బిజీగానే ఉంటారు.ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారు అంటూ టాక్ వినిపిస్తోంది.