తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ( Bramhanandam ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలు నటించి ఎన్నో అద్భుతమైనటువంటి రికార్డులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి.ఇలా బ్రహ్మానందం తెరపై కనిపించారంటే చాలు ప్రేక్షకుల పెదవులపై నవ్వు రావడం ఖాయం అంత అద్భుతంగా తన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు బ్రహ్మానందం.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ ( Comedian ) గా కొనసాగుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించారు.వయస్సు మీద పడటంతో కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇకపోతే బ్రహ్మానందం కమెడియన్ గా ఇంతమందిని నవ్విస్తున్నారు.మరి ఆయన మొదటిసారి తెరపై కనిపించినప్పుడు తన తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా అలీతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్రహ్మానందానికి అలీ ఒక ప్రశ్న వేశారు.మీ సక్సెస్ చూసి నాన్నగారు ఎలా ఫీలయ్యారనే ప్రశ్న వేయడంతో బ్రహ్మానందం ఎన్నో విషయాలను వెల్లడించారు.బ్రహ్మానందం మొదటిసారి ఆహా నా పెళ్ళంట( Ahaa Na Pellanta) సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా కంటే ముందు రెండు మూడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన పెద్దగా సక్సెస్ రాలేదు.
అయితే ఈ సినిమాని తన తండ్రితో కలిసి థియేటర్లో చూస్తున్నప్పుడు అందరూ పెద్ద ఎత్తున నవ్వుతూ ఉన్నారట.అది చూసి మా నాన్న ఇది ఎలా సాధ్యం రా ఇంతమందిని ఎలా నవ్వించగలుగుతున్నావు అంటూ ఆశ్చర్యపోయారని బ్రహ్మానందం తన తండ్రి ఫస్ట్ రియాక్షన్ గురించి చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.