ప్రస్తుత కాలంలో మనుషుల అభిరుచులు రోజురోజుకీ మారుతుండడంతో మార్కెట్లోకి అనేక రకాల ఆహార పదార్థాలలో పాటు వివిధ రకాల వంటకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.ఇందులో కొన్ని చాలా ఖరీదైనవి కూడా ఉండడం గమనార్హం.
తాజాగా బంగారంతో( Gold ) తయారుచేసిన ఓ పప్పు రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ రెసిపీ లో స్వచ్ఛమైన గోల్డ్ తో దాల్ కిచిడిని తయారు చేశారు.

ప్రస్తుతం ఈ కర్రీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.దుబాయ్ లో( Dubai ) బాగా పేరుగాంచిన చెఫ్ రణవీర్ బ్రార్. తన రెస్టారెంట్ లోనే ఈ కలకండానికి ప్రాణం పోశారు.ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ అందుకుంది ఈ బంగారంతో తయారు చేసిన దాల్ కర్రీ. ఇక్కడ ఈ రెసిపీని ‘ దాల్ కస్కన్ ‘( Dal Kashkan ) అని పిలుస్తారు.
ఈ రెసిపీలో పప్పును ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం రజనులతో తయారు చేసిన తర్వాత కస్టమర్లకు వడ్డిస్తారు.

కస్టమర్లకు వడ్డన చేసే సమయంలో ఈ కర్రీని ఒక ప్రీమియం లుక్ ఉన్న చెక్క పెట్టలో తీసుకోవచ్చి అందులో ప్రీమియం మసాలాలు తోపాటు నెయ్యిని కూడా తీసుకోవచ్చి కస్టమర్లకు వడ్డిస్తారు.అయితే బంగారంతో తయారు చేసిన పప్పు భారత కరెన్సీలో 1300 రూపాయలుగా ఉంది.ఇలాంటి రకాలు ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.







