భారత్ కి మద్దతు తెలిపిన డెమొక్రాట్ పార్టీ..

కాశ్మీర్ అంశం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవగాహన రహిత వ్యాఖ్యలపై భారత్ లో పెద్ద దుమారం రేగింది.

అమెరికాకి అధ్యక్షుడు అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎంతో మంది ట్రంప్ పై నిప్పులు చెరిగారు.

భారత ప్రభుత్వం ఆ వ్యాఖ్యలని సైతం ఖండించింది.మోడీ అసలు ఈ అంశంపై మూడో వ్యక్తి జోక్యం ఎప్పుడూ అడగలేదని కుండబద్దలు కొట్టింది.

దాంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమే సృష్టించాయి.ఇదిలాఉంటే

ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలో కూడా పెద్ద దుమారం రేగింది.ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ కీలక నేత బ్రాడ్‌ షెర్మాన్‌, పలువురు చట్టసభల ప్రతినిధులు కూడా ట్రంప్ వ్యాఖ్యలని ఖండించారు.అంతేకాదు బ్రాడ్‌ షెర్మాన్‌ భారత రాయబారికి క్షమాపణలు కూడా చెప్పారు.

Advertisement

కాశ్మీర్ విషయంలో మరొకరి జోక్యానికి భారత్ వ్యతిరేకమని , ఈ విషయం అందరికి తెలుసునని, ట్రంప్ ఎందుకు ఇలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో అలజడి సృష్టించేవిలా ఉన్నాయని, అందుకే భారత రాయబారికి క్షమాపణలు డెమొక్రాట్ పార్టీ తరుపున తెలిపామని ఆయన అన్నారు.

అంతేకాదు విదేశీ వ్యవహారాల పై హౌస్ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న ఎలియన్‌ ఎంజెల్‌ సైతం భారత్ కి మద్దతు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు