వైరల్: బైక్‌పై వెళ్తూ ఎక్సట్రాలు చేసిన కుర్రాళ్లు... కట్ చేస్తే బలుపు తీరింది!

సోషల్ మీడియా( Social media )లో ఎప్పుడు ఎటువంటి వీడియోలు వైరల్ అవుతాయో చెప్పడం కష్టం.అయితే ఇటీవలి కాలంలో చూసుకుంటే యువత ఏ రకంగా పెట్రేగిపోతోందో చెప్పాల్సిన పనిలేదు.

 Boys Bike Stunts Viral In Social Media , Stunts, Viral Latest News, Viral New-TeluguStop.com

తల్లి దండ్రులు కస్టపడి, నానాయాతన పడి పిల్లలను చదివిస్తూ ఉంటే వారు మాత్రం వారి బాధ్యతలను మరిచి పోకిరీ వేషాలు వేస్తున్న పరిస్థితి.మరీ ముఖ్యంగా కుర్రాళ్ళు( Boys ) అయితే రోడ్లపై వెళ్ళేటప్పుడు కన్నుమిన్ను కానకుండా డ్రైవ్ చేస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తూ… ఎదుటివారిని సైతం ఇబ్బంది పెట్టిన పరిస్థితి.

తాజాగా అటువంటి రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.ఈమధ్య కాలంలో బైక్ స్టంట్లు చేసే వారు తెగ రెచ్చిపోతున్నారు.వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఒకే బైక్‌పై ముగ్గురు కుర్రాళ్లు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా వెళ్తున్నారు.వెనుక నుంచి ఒకరు వీడియో తీస్తుండగా బైక్ నడుపుతున్న కుర్రాడు స్టంట్( Stunts ) చేయబోయాడు.

బైక్‌ను అటూ ఇటూ తిప్పుతూ రోడ్డుపై మెలికలు తిరుగుతూ వెళ్ళాడు.ఇంకేముంది కేట్ చేస్తే కొన్ని సెకెనుల వ్యవధిలోనే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టాడు.దాంతో ముగ్గురూ ఎగిరి పడిపోయారు.

ఈ వీడియోను నేహా అగర్వాల్97 అనే ట్విటర్ యూజర్ షేర్ చేయగా వెలుగు చూసింది.ఇప్పటివరకు దీనిని 70 వేల మంచి చూడడం కొసమెరుపు.కాగా, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

వ్యూస్ కోసం అలాంటి పనికి మాలిన పనులు చేస్తారా అని కొంతమంది కామెంట్ చేస్తే… మరికొందరు ఇలాంటివారిని చూస్తూ ఊరుకోకూడదు… వారిని వెంటనే అరెస్ట్ చేయండి అని పోలీసులను తమ కామెంట్స్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube