పెళ్లంటే.నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ వుంటారు.
అందుకే వధూవరులు ఇద్దరూ వివాహానికి సంబందించిన ప్రతి అంశాన్ని చాలా బాధ్యతగా తీసుకుంటారు.ఈ క్రమంలో తాము పొందిన మధురానుభూతులను జ్ఞాపకాలుగా దాచేయాలని ఆరాటపడుతూ వుంటారు.
ఇందులోనుండి వచ్చినవే ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్.ఇక మెయిన్ వెడ్డింగ్ ఈవెంట్ ఉండనే ఉంటుంది.
ఈరోజుల్లో వీటికోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు అంటే పెద్దగా ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు.
ఇపుడు వివాహ వేడుకలో ఫొటోషూట్‌లు, వీడియో సాంగ్స్ చాలా కామనైపోయింది.
మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండేందుకు వధువరులు కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వరుడు ఫొటో గ్రాఫర్ కావడంతో కాస్త డిఫరెంట్‌గా ఆలోచించినట్లున్నాడు.
అందుకే తన పెళ్లిలో వధువు ఫొటోలను డిఫరెంట్ యాంగిల్స్‌లో స్వయంగా తానే తీసేస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.

వృత్తి పరంగా ఫొటోగ్రాఫర్ అయినటువంటి సేన్.తన ప్రేయసితో ఏడడుగులు నడిచిన తరువాత కెమెరాను అందుకున్నాడు.తరువాత పర్ఫెక్ట్ లైటింగ్ చూసుకొని వధువు ఫొటోలు తీశాడు.ఈ వీడియోను స్లైన్ ఫోటో-గ్రాఫిక్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి.నూతన దంపతులను అభినందిస్తూ పెద్దసంఖ్యలో ఇన్‌స్టా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
మీరు కూడా సదరు వీడియోని చూసి మీకు తోచిన అంశాన్ని అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి.







