టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు.ఈయన సినిమాలు తీసే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
అయితే భారీ ప్లాప్ చూసిన తర్వాత బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసి అఖండమైన విజయం అందుకున్నాడు.ఈ సినిమా వీరిద్దరి కెరీర్ లోనే మైలు రాయిలా నిలిచి పోయినది.
ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించిన తర్వాత బోయపాటి శ్రీను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయాలని అనుకున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కేరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచి పోయింది.
మరోసారి వీరిద్దరూ సినిమా చేయాలనీ అనుకున్నారు.బన్నీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది.
అయితే సుకుమార్ పుష్ప 2 సినిమా కూడా వెంటనే తెరకెక్కించాలని అనుకోవడంతో బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీ కానున్నాడు.దీంతో బోయపాటి మరొక హీరోతో సినిమా సెట్ చేసుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు.అందరి ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఉన్నాయి.
ఒక్క రామ్ సినిమా వారియర్ మాత్రం ముగింపు దశకు చేరుకుంది.

దీంతో ఈయన రామ్ ను ఫైనల్ చేసుకున్నాడట.ఇటు రామ్ కూడా బోయపాటి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.దీంతో బోయపాటి ఇప్పటికే రామ్ కు కథ వినిపించి చర్చలు కూడా పూర్తి చేసి ఈ సినిమాను ఖరారు చేశారట.
దీంతో ఈ ప్రాజెక్ట్ పక్కా అంటున్నారు.రామ్ కూడా ఇష్మార్ట్ శంకర్ తర్వాత మాస్ సినిమాలను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పట్టాలెక్క బోతుంది.మరి రామ్ ను బోయపాటి తన సినిమాలో ఏ స్థాయిలో చూపిస్తాడో చూడాలి.