బాలయ్యకు హిట్టిచ్చే సామర్థ్యం ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ శైలిని, స్టైల్ ను అర్థం చేసుకుని ఈ మధ్య కాలంలో హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా? అంటే బోయపాటి శ్రీను మాత్రమేనని చెప్పాలి.బోయపాటి శ్రీను సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించినా ఏ పాత్ర ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది.

గోపీచంద్ మలినేని బాలయ్యను డ్యూయల్ రోల్ లో చూపించినా రెండు పాత్రలకు న్యాయం చేయడంలో తడబడ్డారు.

వీరసింహారెడ్డి సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చని చెప్పిన గోపీచంద్ మలినేని ఫస్టాఫ్ తో మెప్పించినా సెకండాఫ్ తో మాత్రం నిరాశపరిచారు.

లెక్కకు మించిన ఫైట్లు, పాటలు, కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్లు లేకపోవడం సినిమాకు మైనస్ అయింది.బాలయ్య బోయపాటి కాంబినేషన్ మాత్రమే హిట్ కాంబినేషన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సింహా, లెజెండ్, అఖండ విజయాలతో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.వీరసింహారెడ్డి అంచనాలను అందుకోకపోవడంతో బాలయ్య అభిమానుల ఆశలన్నీ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాపైనే ఉన్నాయి.సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అనే భావన ఇండస్ట్రీ వర్గాల్లో ఉందనే సంగతి తెలిసిందే.

బోయపాటి శ్రీను తరహాలో ఇతర దర్శకులు బాలయ్యను హ్యాండిల్ చేయలేకపోతున్నారు.ట్రైలర్ల వరకు మెప్పించినా సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు.వరుసగా సక్సెస్ లను సాధించడంలో బాలయ్య ఫెయిల్ అవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య సైతం ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

బాలయ్య కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube