అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అన్న ఎక్సయిటింగ్ ఆడియెన్స్ లో ఉంది.అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని అన్నారు.
కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 తీసే పనిలో బిజీగా ఉన్నాడు.అందుకే బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ కథ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారట.
అఖండ 2 మీదే బోయపాటి శ్రీను ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.
బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా అఖండ సినిమా నిలిచింది.
ఈ సినిమా థియేట్రికల్ రన్ లోనే కాదు డిజిటల్ రిలీజ్ లో కూడా సంచలనాలు సృష్టిస్తుంది.అఖండ సినిమా సీక్వెల్ ఉంటుందని సినిమా సక్సెస్ మీట్ లో చెప్పారు బోయపాటి శ్రీను.
అయితే ఆ సీక్వెల్ కోసం పెద్దగా వెయిట్ చేయకుండానే వెంటనే మొదలు పెట్టాలని చూస్తున్నారు.అఖండ 2 వస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి కాగానే అఖండ 2 ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.