టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు.పుట్టిన ప్రతి ఒక్కొక్కరిలో ఎదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది.
దాన్ని గుర్తించి వెలికి తీసినవారే ఇక్కడ ప్రత్యేకంగా కనబడతారు.ముఖ్యంగా ఓ మనిషిలోని వున్న టాలెంట్ తన చిన్నప్పుడే గ్రహించవచ్చు.
తదనుగుణంగా వారిని ప్రోత్సహిస్తే వున్నత శిఖరాలను చేరుకోగలుగుతారు.అయితే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పుస్తకాలతో కుస్తీపట్టమని వారి పిల్లలని ఏపుకు తింటారు కానీ, వారి ఇంటరెస్ట్ ఏమిటో గుర్తించనే గుర్తించరు.
మనలో అనేకమంది సంగీతం పట్ల చాలా మక్కువ చూపుతారు.
ఈ క్రమంలో తమ నైపుణ్యానికి తగిన వాయిద్యాలు కొనుక్కొనే స్తోమత లేకపోయినా వారికి అందుబాటులో ఉన్నవాటితోనే తమలో ఉన్న ప్రతిభను చాటుకుంటారు.తాజాగా, ఓ బుడతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.అవును… ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో చిన్న పిల్లవాడు స్క్రాప్ మరియు ఖాళీ పాత్రలను డ్రమ్స్‌లా వాయిస్తున్నాడు.కాగా అతని ప్రతిభకు ఫిదా అయిపోతున్నారు.
దాంతో ఈ వీడియో ఏకంగా 47 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది.
ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ క్లిప్ 47 మిలియన్లకు చేరుకోవడం విశేషమనే చెప్పుకోవాలి.సదరు బాలుడు స్క్రాప్ మెటీరియల్స్ మరియు ఖాళీ పాత్రలతో తయారు చేసిన ఆ డ్రమ్స్ సెట్ ని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.కాగా బాలుడి ప్రతిభకు నెటిజన్లు తమదైన స్టయిల్ లో కామెంట్లు పెడుతున్నారు.
బుడతా నువ్వు సూపర్ రా అని ఒకరంటే….రాబోయే రోజుల్లో కాబోయే సంగీత దర్శకుడు అని ఆ బుడతదానిని ఆకాశానికెత్తేస్తున్నారు.
మరికొందరైతే అలా పిల్లల్ని తమకిష్టమైన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని సూచిస్తున్నారు.