పక్షితో హ్యాపీగా ఫుడ్ షేర్ చేసుకుంటున్న బాలుడు.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని భయపడతాయి.మరికొన్ని నవ్విస్తాయి.

 Boy Happily Sharing Food With Bird Video Viral , Viral News, Latest News, Kind P-TeluguStop.com

ఇంకొన్ని హార్ట్ టచింగ్ గా ఉండి మనసులను దోచేస్తాయి.సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియోనే వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక బాలుడు పక్షితో( boy with a bird ) తాను తింటున్న ఆహారాన్ని షేర్ చేసుకున్నాడు.అంతే కాదు పక్షి తన గిన్నె నుంచి అన్నం తింటూ ఉంటే అతడు బాగా సంతోషించాడు.

ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ముచ్చట పడిన బాలుడు తన పెదవులపై చిరునవ్వులు కూడా చిందించాడు.

అతని ఆహారపు గిన్నెలో ఏవో తినదగిన ఆకులు, రసం, రైస్( Leaves, juice, rice ) ఉన్నాయి.అయితే పక్షి రైస్ తింటూ కనిపించింది.ఆ బాలుడు “ఇంకా ఆహారం కావాలా నీకు?” అంటూ తన చేతికి అతికిన మెతుకులను దాని ముందు ఉంచాడు.ఆ పక్షి ఎగిరిపోకుండా అతడి గిన్నె పైనే ఉండి చేతి మీద ఉన్న మెతుకులను తిన్నది.ఆ సమయంలో ఈ పిల్లోడు తెగ సంతోషించాడు.ఆ దృశ్యం చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

@buitengebieden ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.20 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ఇప్పటికే 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.

ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల ఇలానే దయ చూపిస్తే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశం అవుతుందని అన్నారు.జంతువుల పట్లనే కాకుండా నిస్సహాయక స్థితిలో ఉన్న మనుషుల పట్ల కూడా దయ చూపించాలని కోరారు.

ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube