ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. ఎక్కడుందో తెలుసా..!

శ్రీరాముని( Lord Srirama ) పేరు భక్తజన కోటి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం అని పండితులు చెబుతున్నారు.

రాముడితో తెలుగు నేలకు విశేషా అనుబంధం ఉంది.

ఆ పేరు చెబితే చాలు తెలుగు లొగ్గిళ్ళు పులకిస్తాయి.భక్తితో నమస్కరిస్తాయి.

రామయ్య మా వాడే అంటూ ఆప్యాయంగా హత్తుకుంటాయి.రఘునందుడి కళ్యాణంతో పాటు పట్టాభిషేక మహోత్సవం జరిగే శ్రీ రామనవమి( Srirama Navami )కి ఆ సీతారామ లక్ష్మణులను చూసేందుకు రెండు కళ్ళు చాలావు.

నీలమేఘ శ్యాముని పై తమ భక్తిని పలు రకాలుగా చాటుకుంటారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో శ్రీరాముడు కోదండం ఎక్కు పెట్టినట్టు నిర్మించిన దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Advertisement

విజయనగరం నుంచి కోరుకొండ( Vijayanagaram Korukonda ) వెళ్లే దారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఎన్సీఎస్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మించింది.నారాయణ నరసింహమూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు ఈ దేవాలయాన్ని నిర్మించారు.

ఈ మందిరాన్ని గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు 2014 మార్చి 22న మొదలుపెట్టారు.15 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఆధ్యాత్మిక కట్టడం మంచి పర్యాటక ప్రదేశంగా ఆకర్షిస్తుంది.విల్లు ఆకారంలో నిర్మించి ఈ దేవాలయంలో రామాయణం( Ramayanam) లోని 72 ఘట్టాలను, 72 విగ్రహాలుగా చెక్కారు.

ధనస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని( 60 Feet Anjaneya Swamy Statue ) ప్రతిష్టించారు.దేవాలయ ప్రాంగణంలో వేద పాఠశాల సైతం నిర్వహిస్తున్నారు.

ఈ దేవాలయాన్ని రెండంతస్థులుగా నిర్మించారు.బయట జయ విజయాలు విజయులు, గరుత్మంతుడు, శుకుడు నారద తుంబురుల విగ్రహాలు ఉన్నాయి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తున శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు కనిపిస్తాయి.

Advertisement

ఈ రెండు విగ్రహాల దగ్గర ఫౌంటెన్ లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.మెట్లకు ముందు ఈ దేవాలయాన్ని నిర్మించిన నారాయణం నరసింహమూర్తి విగ్రహం, పెద్దపుల తోట ఉంటుంది.కింది అంతస్తులో అన్న ప్రసాద శాల, అల్పాహార శాల, గ్రంథాలయం, వేద పాఠశాల, కళ్యాణ మండపం, గోశాల ధాన్య మందిరం లాంటివి ఎన్నో ఉన్నాయి.

తాజా వార్తలు