తెలంగాణ లో రాజకీయ పొత్తులు చిత్ర విచిత్రంగా ఉన్నాయి.ఒక పార్టీ మీద ఒక పార్టీ ఎత్తులు వేస్తూ… ప్రత్యర్థులను చిత్తు చిత్తు చేయాలని చూస్తున్నాయి.
టీఆర్ఎస్ బద్ద శత్రువులైన పార్టీలన్నీ … ఒక కూటమిగా ఏర్పడి రాజకీయం గా బలపడి అధికారం చేపట్టాలని చూస్తున్నాయి.ఇక టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది కాకపోతే… ఎంఐఎం పార్టీతో రహస్య పొత్తు కొనసాగిస్తోంది.
ఇక ఒంటరిగా మిగిలిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది మిగిలింది ఒక్క బీజేపీ పార్టీనే.అయితే ఇక్కడే అసలు సిసలైన రాజకీయ ఎత్తుగడలు రహస్య అజెండాలు బయటపడుతున్నాయి.
కాకపోతే … అందులో టీఆర్ఎస్ , బీజేపీ, బీజేపీ – ఎంఐఎం భాగస్వాములుగా ఉన్నాయి అనే అనుమానాలు బలపడుతున్నాయి.

టీఆర్ఎస్ – ఎంఐఎం పార్టీలు బహిరంగంగానే తాము మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్నాయి కానీ అధికారకంగా ఎక్కడా పొత్తు పై ప్రకటన చేయడంలేదు.కాకపోతే పొత్తు ఉండదు పోటీలన్నీ స్నేహపూర్వక పోటీలే అని ప్రకటించాయి.ఎంఐఎం స్థానాలలో వారికి ఏ ఇబ్బంది లేకుండా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది టీఆర్ఎస్.
బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మరో ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉంది.సాక్షాత్తు ప్రధాని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతారు ఇక్కడ మాత్రం ఆ పార్టీ నేతలు ఇక్కడకు వచ్చినప్పుడు అమిత్ షా దీనిని అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు.
ప్రస్తుతం తెలంగాణాలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది.

కాకపోతే అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది.పార్టీ అభ్యర్థుల పూర్తి బయోడేటా పరిశీలిస్తే బీజేపీ బలంగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను పెట్టడం, టీఆర్ఎస్ బలంగా ఉన్న చోట బీజేపీ బలహీన అభ్యర్థులను పెట్టడం జరిగింది.దీని ద్వారా ఒకరి గెలుపుకు ఒకరు కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇక బీజేపీ, ఎంఐఎంలకు కూడా చీకటి ఒప్పందాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది.బీజేపీ బలంగా ఉండే చోట్ల ముస్లింలు కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా ఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టింది.
అలాగే ఎంఐఎం పోటీచేసే చోట హిందువులకు టిక్కెట్లు ఇచ్చి ముస్లిం ఓట్లు అన్నీ ఎంఐఎంకు ఒన్ సైడ్ గా పడేలా ప్లాన్ చేసింది బీజేపీ.







