టి.టీడీపీ మ్యానిఫెస్టో విడుదల !

తెలంగాణ టీడీపీ సొంతంగా ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది.ఈ మ్యానిఫెస్టో ద్వారా కేసీఆర్ కి గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది.

 Telangana Tdp Releases Election Manifesto-TeluguStop.com

ఈ మేరకు….తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగంతో పాటు సొంత ఇంటి కోసం 10 లక్షల సాయం చేయడం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3వేలు భృతి కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మొదటి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ, ఇంటర్ నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ప్రజాసుపత్రిగా ప్రగతి భవన్ మార్పు, వికారాబాద్‌లో నేచర్ క్యూర్ చికిత్సాలయం, 8వ తరగతి నుంచి బాలికలకు సైకిళ్ళ పంపిణీ, ప్రార్థనా మందిరాల్లో పని చేసే వారికి నెల జీతం, హైదరాబాదులో ఐటీఐఆర్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్.ఇలా పలు హామీలు ఉన్నాయి.

అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి టీడీపీ మేనిఫెస్టోను జాగ్రత్తగా.తయారు చేశామని రమణ చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని ఆయన వివరించారు.ముఖ్యంగా రైతుల సంక్షేమానికి ఇందులో పెద్ద పీత వేశామని రమణ ఈ సందర్భంగా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube