బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బోనీ కపూర్ గురించి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన నటి శ్రీదేవిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే శ్రీదేవి వారసురాలిగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా జాన్వీ నటించిన మిలీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బోని కపూర్ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమం అనంతరం జాన్వీ కపూర్, బోనీ కపూర్ ఇద్దరు కూడా మీడియాతో ముచ్చటించారు.అయితే ఓ విలేకరి మాత్రం నటి జాన్వీ కపూర్ ను శ్రీదేవితో పోల్చడం గమనించిన బోనీకపూర్ అతనిని స్టాప్ చేయమని మాట్లాడారు.
తన కూతురిని ఎలాంటి పరిస్థితులలో కూడా తన తల్లి శ్రీదేవితో పోల్చవద్దని ఈయన అడ్డుపడ్డారు.బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని దాదాపు 200 సినిమాలు చేసిన తర్వాత ఆమె ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
శ్రీదేవి తన నటన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది.కానీ నా బేబీ జాన్వీ ఇప్పుడిప్పుడే తన కెరియర్ ప్రారంబిస్తుంది.ఇప్పుడే తన కెరియర్ ప్రారంభించిన తన కూతురిని నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగిన శ్రీదేవితో పోల్చవద్దని ఆమె కూడా తనలా అన్నీ నేర్చుకుంటుందంటూ ఈ సందర్భంగా ఈయన శ్రీదేవితో జాన్వీ కపూర్ ను పోల్చవద్దని తేల్చి చెప్పారు.ఈమె కూడా ఇండస్ట్రీ లోకి వచ్చి పలు సినిమాలలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇక ఈమె సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి ఇప్పటివరకు బోనీ కపూర్ ఏ విధంగాను స్పందించలేదు.