ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది.చాలా దేశాలు యుద్ధం పట్ల ఎంత వారించినా రష్యా వెనుకడుగు వేసేలా కనిపించట్లేదు.
అంతర్జాతీయ స్థాయిలో పశ్చిమ దేశాలు అన్ని రష్యాపై ఆంక్షలు విధించిన విషయం విధితమే.అయినా తగ్గేదేలే అన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయాలతో వరల్డ్ వైడ్‌గా ప్రభావం చూపుతున్నాయి.
అనేక వస్తువుల ధరలతో పాటు, క్రూడాయిల్ ధర అయితే ఆకాశన్నంటింది.ఇక వంట నూనెల ధరలు సైతం అదే బాటపట్టాయి.
యుద్దంకు ముందు వంట నూనెల ధరలు తక్కువగా ఉన్నాయి.యుద్ధం నేపథ్యంలో అవి కాస్త ప్రియమయ్యాయి.
దీంతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో వంటనూనెల ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు కారం, చింత పులుసు చారే దిక్కు అన్న చందనంగా మారింది.
ఇంట్లో చేసే ప్రతి వంటకు నూనె వాడకం తప్పనిసరి.దీంతో నానా తంటాలు పడుతున్నారు.
ఇక హోటళ్లు నడపేవారు పడే బాధలు వర్ణణాతీతం.ఇక చిన్నచిన్న హోటళ్లైతే నడిపే పరిస్థితి లేకుండా పోతోంది.
మరోవైపు నూనె వ్యాపారులు అయితే లాభాలు గడిస్తున్నారు.కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచి విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఏడాది కిందట ఉన్న వంట నూనెల ధరలతో పోలిస్తే ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగాయి.సన్‌ఫ్లవర్ ఫ్రీడమ్ లాంటి కంపనీల ఆయిల్ ధరలు సామాన్యలుకు అందుబాటులో ఉండేవి.ఇలా ఏ బ్రాండ్ వంట నూనె అయినా రూ.130-రూ.140 లోపే ఉండేవి.ఐదు కిలోల ఆయిల్ డబ్బా అయితే సుమారు రూ.700 లోపే ఉండేవి.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వాటి ధరలు భగ్గు మంటున్నాయి. రూ.175 నుంచి ఆపైగా ఆయిల్ కంపెనీలు విక్రయిస్తున్నాయి.ప్రస్తుతం ఐదు లీటర్ల నూనె డబ్బా రూ.900 దాకా ఉంది.దీంతో హోటళ్లు నడిపే వారు ఆయిల్ వంటకాలను, స్వీట్లు తయారు చేయడం లాంటివి మానేస్తున్న పరిస్థితి.కనీసం బజ్జీలు, బోండాలు తిందామన్నా ప్రియమవుతున్నాయి.మరి కొందరు నూనె రేటు పెరిగిందంటూ వస్తువుల ధరల రేట్టు పెంచి విక్రయించడం గమనార్హం.