ఐస్‌క్రీమ్‌తో బోండా.. ఇలా ఎప్పుడైనా తిన్నారా?

మీలో ఎంతమందికి ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం? అదేం ప్రశ్న? ఐస్ క్రీమ్( Ice cream ) ఎవరికి ఇష్టం వుండదు అని అంటారా? నిజమే, ఐస్ క్రీంని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి? చాలా మంది వర్షం పడగానే వేడి వేడి పదార్థాలు తినడానికి ఆసక్తి చూపినట్టుగా కాస్త ఎండలు ఎక్కువగా వున్నపుడు చల్లచల్లని ఐస్ క్రీమ్ తినాలని జిహ్వ కోరుకుంటుంది.చిన్నపిల్లలైతే మరీను, వీరికి కాలంతో సంబంధం లేదు.

 Bonda With Ice Cream Have You Ever Eaten Like This, Coconut, Coconut Ice Cream,-TeluguStop.com

ఐస్ క్రీమ్ బండి వాడు చేసిన సౌండ్ వినగానే అమ్మ ఐస్ క్రీమ్, నాన్న ఐస్ క్రీమ్ అంటూ గోల చేస్తూ కొనేదాకా విడిచి పెట్టరు.అందుకే చాలామంది వ్యాపారస్తులు తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వెంటనే తట్టేది ఈ ఐస్ క్రీమ్ వ్యాపారమే.

Telugu Coconut, Coconut Cream, Latest-Latest News - Telugu

ఇక కథలోకి వెళితే, మనలో చాలామంది అలా సాయంత్రం పూట వెళ్లి స్నాక్స్ తింటూ స్నేహితులతో పిచ్చాపాటి వేస్తూ వుంటారు.ఈ క్రమంలో వేడివేడి మిర్చీబజ్జీలు, పానీపూరీ, కట్లేట్ లు తింటూ వుంటారు.అందులో బజ్జీల గురించి ఇక చెప్పనక్కర్లేదు.మిరపకాయ్ బజ్జి, అరటికాయ బజ్జి, ఎగ్ బజ్జి, ఎల్లిపాయలు, క్యారెట్ బజ్జిలు తింటూ వుంటారు.ఇక బజ్జీలకు వున్న మార్కెట్ ని బట్టి వ్యాపారస్తులు రకరకాల బజ్జీలను పరిచయం చేస్తూ జనాలని ఆకట్టుకొనే పనిలో వుంటారు.ఈ క్రమంలో మొన్నటికి మొన్న చాక్లెట్ బజ్జీల రెసిపీని మనం చూసాం.

అదే విడ్డురం అనుకుంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మరింత విడ్డురంగా కనిపిస్తోంది.

Telugu Coconut, Coconut Cream, Latest-Latest News - Telugu

బెంగళూరులోని అమర్‌నాథ్ చాట్స్( Amarnath Chats in Bangalore ) అనే చిన్న కార్ట్‌లో మీరు విభిన్నమైన ఐస్‌క్రీం బోండా( Ice Cream Bonda ), భజ్జీలను ఆరగించొచ్చు.వినడానికి కాస్త కామెడీగా వున్నా వీటిని తినడానికి పెద్ద ఎత్తున కస్టమర్లు అక్కడికి వెళ్తున్నారు మరి.ఇక మీరు కూడా ఈ ఐస్ క్రీం బోండా, భజ్జీని తినాలకుంటే 547/2 రాష్ట్రీయ విద్యాలయ రోడ్, 2వ బ్లాక్ జయనగర్ ఈస్ట్, బెంగళూరు 560004 వద్ద వున్న బజ్జీ స్టాళ్ల దగ్గరకు వెళ్ళవచ్చు.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, 9448558418 ఈ నంబర్‌కు కాల్ చేస్తే ఈ షాప్ ఎక్కడుందో హోటల్ యజమాని మంజునాథ్ మీకు తెలియజేస్తారు.మీరు మీ స్నేహితులతో అక్కడికి వెళ్ళినపుడు ఖచ్చితంగా వాటిని రుచి చూసి మాకు సమాచారం ఇవ్వండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube