Bonda Uma: అయ్యన్నపాత్రుడు అరెస్టుపై బోండా ఉమా నిరసన

జగన్ రెడ్డి రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ… అయ్యన్నపాత్రున్ని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి నిదర్శనమని మండిపడ్డారు.

 Bonda Uma Fires On Jagan Government Over Ayyannapatrudu Arrest, Bonda Uma , Jaga-TeluguStop.com

విశాఖ భూ కబ్జాలు, బాబాయ్ హత్య కేసులో సీబీఐ కి షర్మిల వాంగ్మూలం నుంచి దృష్టి మరల్చేందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.బడుగు, బలహీన వర్గాలను వేధిస్తూ జగన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు.

ఏపీ సీఐడీ వ్యవస్థ వైసీపీ చొక్కాలేసుకుని పనిచేయడం సిగ్గుచేటని విమర్శించారు.అర్ధరాత్రి దొంగల్లా గోడదూకి అయ్యన్న ఇంటికెళ్లడమేంటని ప్రశ్నించారు. ‘‘జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమేనా అయ్యన్న చేసిన తప్పు?… వైసీపీలో సిగ్గులేని బీసీ మంత్రులు ఈ ఘటనపై నోరు విప్పరేం?… బీసీ ద్రోహి జగన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?’’ అంటూ బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube