అయ్యన్నపాత్రుడు అరెస్టుపై బోండా ఉమా నిరసన

జగన్ రెడ్డి రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

గురువారం మీడియాతో మాట్లాడుతూ.అయ్యన్నపాత్రున్ని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి నిదర్శనమని మండిపడ్డారు.

విశాఖ భూ కబ్జాలు, బాబాయ్ హత్య కేసులో సీబీఐ కి షర్మిల వాంగ్మూలం నుంచి దృష్టి మరల్చేందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

బడుగు, బలహీన వర్గాలను వేధిస్తూ జగన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు.ఏపీ సీఐడీ వ్యవస్థ వైసీపీ చొక్కాలేసుకుని పనిచేయడం సిగ్గుచేటని విమర్శించారు.

అర్ధరాత్రి దొంగల్లా గోడదూకి అయ్యన్న ఇంటికెళ్లడమేంటని ప్రశ్నించారు. ‘‘జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమేనా అయ్యన్న చేసిన తప్పు?.

వైసీపీలో సిగ్గులేని బీసీ మంత్రులు ఈ ఘటనపై నోరు విప్పరేం?.బీసీ ద్రోహి జగన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?’’ అంటూ బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.

చైనాలో విజువల్ వండర్.. మల్టీ-లెవెల్ సిటీ చూస్తే మతిపోతుంది..