ఎన్టీఆర్‌ 30 రియల్‌ పాన్‌ ఇండియా మూవీ అంటున్న ఫ్యాన్స్.. ఇదే సాక్ష్యం

Bollywood Stars Acting In Ntr 30 Movie , Janhvi Kapoor, NTR 30, RRR Movie, Saif Ali Khan,NTR,Koratala Shiva

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో సినిమా కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగబోతున్నాయి.

 Bollywood Stars Acting In Ntr 30 Movie , Janhvi Kapoor, Ntr 30, Rrr Movie, Sai-TeluguStop.com

వచ్చే వారంలో ఏ సమయంలో అయినా ఎన్టీఆర్ 30 ( NTR 30)సినిమా యొక్క ముహూర్తపు షాట్ కి క్లాప్ పడే అవకాశాలు ఉన్నాయి.కనుక అభిమానులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌( Janhvi Kapoor) నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇక ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.ఆ విషయం పక్కన పెడితే బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్‌ త్వరలో జరగబోతున్న సినిమా యొక్క పూజా కార్యక్రమాలకు కూడా హాజరు కాబోతున్నాడట.

ఆ విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది.

జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్‌ లు ఎన్టీఆర్‌ 30 నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.అంతే కాకుండా ఎన్టీఆర్ యొక్క సినిమా స్థాయి పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సోషల్‌ మీడియాలో పాన్ ఇండియా మూవీ అంటే ఇది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా అనడంతో పాటు సినిమాలో కీలక పాత్రలో జాన్వీ కపూర్ నటించడంతో పాటు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్న కారణంగా హిందీ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కొరటాల ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి సినిమాను చేస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు.

Video : Bollywood Stars Acting In Ntr 30 Movie , Janhvi Kapoor, NTR 30, RRR Movie, Saif Ali Khan,NTR,Koratala Shiva #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube