తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుతున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసిన కూడా అది పాన్ ఇండియాలో ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగా చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది.సలార్ కి( Salaar ) ముందు ఆయనకు మూడు సినిమాలతో భారీ ప్లాప్ లు రావడంతో ఇప్పుడు చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక అదే క్రమం లో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడైన సంజయ్ దత్ ను( Sanjay Dutt ) తీసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ప్రభాస్ కూడా ఈ విషయం లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.మరి ప్రభాస్ సందీప్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ఇప్పుడే అభిమానులు భారీ ఎత్తున లెక్కలైతే పెడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు కూడా తొందరలోనే షూటింగ్ ముగించుకుంటాయి.కాబట్టి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత స్పిరిట్ సినిమా( Spirit Movie ) కోసం తన ఫుల్ డేట్స్ ఇచ్చేస్తున్నట్టు గా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ అయితే ఇక ఇండియాలో తనని మించిన నటుడు ఎవరు ఉండరు అనే చెప్పాలి…చూడాలి మరి స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ ను ఇస్తాడు అనేది…
.







