ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్( Young Rebel Star Prabhas ) అనే చెప్పాలి.ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఆయనకున్న గుర్తింపు మరే హీరోకి లేదు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఇండియాలోని ప్రఖ్యాత దర్శకులంతా పోటీపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే మన తెలుగు డైరెక్టర్లు అయిన సందీప్ రెడ్డివంగా( Sandeep Reddy Vanga ), నాగ్ అశ్విన్ , మారుతి లాంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇకముందు కూడా చాలామంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు.
ఇక ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన సంజలీలా బన్సాలి( Sanjay Leela Bhansali ) కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.మరి ఆయన ప్రభాస్ కి కథ చెప్పాడా ఆయన ఓకే చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన మాత్రం ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఎందుకంటే బాలీవుడ్ లో ఉన్న హీరోలు ఎవరూ కూడా ప్రస్తుతం బారీ కలెక్షన్స్ ని రాబట్టడం లేదు అలాగే ప్రభాస్ తో సినిమా చేస్తేనే ఆ సినిమా భారీ కలెక్షన్స్ రాబడటంతో పాటు డైరెక్టర్లు కూడా స్టార్ డైరెక్టర్లుగా మారే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి అందుకోసమే ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ప్రభాస్ మాత్రం తెలుగు డైరెక్టర్ల తోనే( Telugu Directors ) సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు.మరి ఈ క్రమంలో వివిధ భాషల్లో ఉన్న దర్శకులకి అవకాశం ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు…
.