Cholestrol : అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.. అయితే మీ డైట్ లో ఈ డ్రింక్ ఉండాల్సిందే!

ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండెకు ముప్పు పెరుగుతుంది.

 Adding This Drink In Your Diet Will Melt Cholesterol-TeluguStop.com

అలాగే చెడు కొలెస్ట్రాల్( Bad Cholestrol ) వల్ల ఊబకాయం బారిన ప‌డ‌తారు.హై బీపీ, టైప్ 2 డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం వస్తాయి.

అందుకే అధిక కొలెస్ట్రాల్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు.కొలెస్ట్రాల్ ను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను మీ డైట్ లో చేర్చుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను చాలా బాగా కరిగించుకోవచ్చు.

Telugu Dietmelt, Cholesterol, Tips, Latest-Telugu Health

మరి ఇంకెందుకు ఆలస్యం కొలెస్ట్రాల్ ను కరిగించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్క( Ginger )ని తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, అల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి.దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Dietmelt, Cholesterol, Tips, Latest-Telugu Health

ఈ వాటర్ లో వన్ టేబుల్ తేనె కలిపితే మన డ్రింక్ సిద్ధమవుతుంది.ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకోవాలి.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క్రమంగా కరిగిపోతుంది.అల్లం, నిమ్మ, దాల్చిన చెక్క, పసుపులో ఉండే పలు సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా కరిగిస్తాయి.

గుండె ఆరోగ్యానికి అండగా నిలబడతాయి.అలాగే ఈ డ్రింక్‌ను తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు కరుగుతుంది.

ఊబ‌కాయం బారి నుంచి బయటపడతారు.వెయిట్ లాస్ అవుతారు.

మ‌రియు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం కంట్రోల్ లో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube