కరోనా కారణంగా వచ్చే ఏడాది వరకు పెద్ద సినిమాలు థియేటర్లలో బొమ్మ పడే అవకాశం కనిపించడం లేదు.ఒక వేళ సినిమాలు విడుదల అయినా కూడా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి అంతకంటే కనిపించడం లేదు.
కనుక వచ్చే ఏడాది వరకు సినిమాలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.మేకింగ్‌లో ఉన్న సినిమాలు సరే అప్పటి వరకు డేట్‌ను దాటవేస్తూ వస్తారు.
కాని ఇప్పటికే విడుదలకు సిద్దం అయిన సినిమాల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది.ఆ సినిమాలకు ఇప్పుడు ఓటీటీ వల వేస్తున్నాయి.
ఇప్పటి వరకు చిన్నా చితకా సినిమాలకే ఓటీటీ వల వేసి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశాయి.మొదటి సారి ఇండియాలో వంద కోట్లకు పైబడిన డీల్‌పై చర్చ జరుగుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ బాలీవుడ్ క్రేజీ మూవీ 83ని కొనుగోలు చేసేందుకు ఏకంగా 150 కోట్ల ఆఫర్‌ను సదరు ఓటీటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.నిర్మాతలు వంద కోట్లకు లోపు బడ్జెట్‌తోనే సినిమాను తెరకెక్కించారు.
కనుక 150 కోట్లకు అమ్మడం వల్ల మంచి లాభమే అని, అలాగే ఇతర రైట్స్ ద్వారా మరో 50 కోట్ల వరకు వస్తుందని భావిస్తున్నారు.

150 కోట్లకు ఓటీటీ బిజినెస్ జరిగితే అదో రికార్డుగా చెప్పుకోవచ్చు.ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు కూడా ఇంతటి భారీ డీల్‌ను సొంతం చేసుకోలేదు.డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్‌కు ఇంతటి మొత్తంను ఇండియన్ సినిమాలు గతంలో దక్కించుకోలేదు.
కనుక 83 చిత్రం తప్పకుండా ఓటీటీలో ప్రసారం అయితే రికార్డుగా భావించవచ్చు.

కపిల్ దేవ్ బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే.ఇండియా 1983లో ప్రపంచ కప్‌ను గెలిచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో జరిగిన సంఘటనలు మరియు విశేషాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
రణవీర్ సింగ్ ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో నటించాడు.
.






