మహర్షిపై కన్నేసిన బాలీవుడ్! సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి  

మహర్షి రీమేక్ పై ద్రుష్టి పెట్టిన బాలీవుడ్ .

Bollywood Industry Plan To Remake Maharshi Movie-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మహేష్ బాబు ఇందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి సినిమాని నడిపించడంతో పాటు, వంశీ అంతర్లీనంగా చెప్పిన సోషల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చడంతో సినిమా నిడివి ఎక్కువగా ఉన్న హిట్ టాక్ తెచ్చుకుంది..

మహర్షిపై కన్నేసిన బాలీవుడ్! సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి -Bollywood Industry Plan To Remake Maharshi Movie

దీంతో మహేష్ కెరియర్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ సీక్వెల్ చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. తాజాగా ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూసినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఈ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అలాగే కోలీవుడ్ లో విజయ్ హీరోగా ఈ సినిమాని రీమేక్ చేయాలని బడా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీమేక్ రైట్స్ పై ఇప్పుడు పలువురు బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ద్రుష్టి పెట్టినట్లు సమాచారం.