మరో బిగ్ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో.. బిటౌన్ లో టెన్షన్ టెన్షన్!

కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ అక్కడ వందల కోట్లు వసూళ్లు చేస్తుంటే.

బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు.

దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.పెద్ద సినిమాలు సైతం ప్లాప్ ఎదుర్కొంటూ బాలీవుడ్ ను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తో, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలతో వచ్చారు.కానీ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

Advertisement

ఈ పెద్ద సినిమాలు అయినా హిట్ అయ్యి బాలీవుడ్ ను గట్టెక్కిస్తాయి అని అంతా అనుకున్నారు కానీ రిజల్ట్ వేరేలా రావడంతో మళ్ళీ మొదటికే వచ్చింది.ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

బ్రహ్మాస్త్ర సినిమాతో టీమ్ అంతా బాలీవుడ్ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ప్రెజెంట్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.మరి 2022లో అతి పెద్ద విజయంగా బాలీవుడ్ లో నిలుస్తుందా? లేదా? అనేది ఇప్పుడు అందరు ఆసక్తిగా చర్చించు కుంటున్నారు.మరి ఈ సినిమా అయినా హిట్ గా నిలిచి బాలీవుడ్ ను కష్టాల నుండి గట్టెక్కిస్తుందో.

Advertisement

లేదంటే మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందో చూడాలి.

తాజా వార్తలు