అవసరం ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ పొగడ్తలతో ముంచెత్తడం ఇక అవసరం తీరిపోయిన తర్వాత నోటికొచ్చినట్లు మాట్లాడటం మనుషుల స్వబావం అని చెబుతూ ఉంటారు.అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలకు సైతం ఇది వర్తిస్తుంది అని కొంతమందిని చూసిన తర్వాత అర్థమవుతూ ఉంటుంది.
ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ బ్రేక్ వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ గా మారి మళ్లీ నార్త్ కు వెళ్ళిన తర్వాత సౌత్ ఇండస్ట్రీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం చేస్తూ ఉన్నారు చాలా మంది హీరోయిన్లు.ఇలాంటి హీరోయిన్ల లిస్టు ఇప్పుడు చూద్దాం.
2013లో మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీ లో కెరీర్ స్టార్ట్ చేసిన రాసి కన్నా ఆ తర్వాత అక్కడ అవకాశాలు కరువవడంతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.
అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ అమ్మడికి విశేషమైన ఆదరణ లభించింది.దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక్కడ అందరు హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ కి జంప్ అయ్యింది.ఈ క్రమంలోనే ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇన్నాళ్లు సౌత్ లో ఒకే రకం క్యారెక్టర్లు చేసి నాలో ఇంత టాలెంట్ ఉందని మర్చిపోయాను.సౌత్ వాళ్ళకి కమర్షియల్ గా కనిపించే హీరోయిన్ కావాలి.
అందుకే ఇప్పుడు వరకు కొత్తగా కనిపించ లేకపోయాను ఇప్పటినుంచి బాలీవుడ్ కథలతో కొత్త రాశిఖన్నాని చూస్తారు అంటూ సౌత్ ఇండస్ట్రీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది.

అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో తో జతకట్టింది పూజా హెగ్డే.కానీ ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.దెబ్బకి మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చేసి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది.ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ పై ఇటీవలే ఊహించని వ్యాఖ్యలు చేసింది.
సౌత్ ఆడియన్స్కి నడుము అంటే చాలా ఇష్టమని మిడ్ డ్రెస్ లోనే చూడాలి అనుకుంటారని సినిమాలో కంపల్సరిగా హీరోయిన్ నడుము మీద కాన్సన్ట్రేట్ చేస్తారని ఇక మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడింది పూజా హెగ్డే. దీంతో ఇక సౌత్ అభిమానులు ఊరుకుంటారా ఈ హీరోయిన్ ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.







