బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న తాజా చిత్రంపఠాన్.ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ చెక్కర్లు కొడుతోంది.అభిమానులు అందరూ కూడా ఆ ఫోటో గురించి తెగ చర్చించుకుంటున్నారు.
అయితే మొదట ఆ ఫోటోని చూసిన అభిమానులు ఎవరు ఈ కొత్త హీరో అని అనుకున్నారు.ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు షారుఖ్ ఖాన్.
సరికొత్త లుక్కులో ఉన్న షారుక్ ఖాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షారుక్ ఖాన్ ఆ లుక్ లో చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటో ని షారుక్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను కూడా పఠాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు షారుక్ ఖాన్.
ఆ ఫోటోలో షారుఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీ,తో పొడవాటి జుట్టుతో మంచం మీద కూర్చుని కేవలం జీన్స్ ప్యాంట్ మాత్రమే ధరించారు.ఆ ఫోటోని చూసిన అభిమానులు ఆనంద పడుతూ ఆ ఫోటోని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే పఠాన్ సినిమా విషయానికొస్తే..సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా సంబంధించిన టీజర్ ప్రోమోను విడుదల చేశారు.కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.