లండన్‌లో భారతీయ విద్యార్ధి మృతి .. 26 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌ నగరానికి చెందిన గురష్మాన్ సింగ్ భాటియా( Gurshman Singh Bhatia ) (23) గత నెలలో యూకేలో మరణించిన సంగతి తెలిసిందే.

దాదాపు 26 రోజుల తర్వాత అతని మృతదేహం స్వస్థలానికి చేరుకుంది.

గురువారం ఉదయం మోడల్ టౌన్ స్మశాన వాటికలో గురష్మాన్ అంత్యక్రియలు ముగిశాయి.కుటుంబ సభ్యులు, స్థానికులు, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు , సిక్కు సంస్థల సభ్యులు యువకుడి అంత్యక్రియలకు హాజరై గురష్మాన్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

కాగా.పుట్టినరోజు వేడుకల అనంతరం కనిపించకుండాపోయిన 23 ఏళ్ల గురష్మాన్ సింగ్ మృతదేహం లండన్‌లోని ( London )ఒక సరస్సు వద్ద పోలీసులు కనుగొన్నారు.గురష్మాన్ చివరిసారిగా డిసెంబర్ 15న తన పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత కానరీ వార్ఫ్‌లో కనిపించాడు.అనంతరం డిసెంబర్ 15 తెల్లవారుజామున 4.20 గంటలకు సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో కనిపించినట్లుగా పోలీసులు తెలిపారు.ఈ కేసును ఛేదించేందుకు గాను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

అలాగే సాక్షులతో మాట్లాడటం , గురష్మాన్ సింగ్ ఫోన్, ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించడం వంటి చర్యలు చేపట్టినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు( Metropolitan Police ) ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

పోలీసులు గురుష్మాన్ సింగ్ మృతదేహాన్ని సౌత్ క్వే నీటిలో కనుగొన్నారు.ఆ వెంటనే జలంధర్‌లోని గురష్మాన్ కుటుంబానికి సమాచారం అందించారు.ఈ ఘటనపై డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే( Chief Superintendent James Conway ) మాట్లాడుతూ.

గురష్మాన్ మరణాన్ని ఊహించలేదన్నారు.ఇది అనుమానాస్పద మరణమని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని, విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే గురష్మాన్ అదృశ్యానికి ముందు తీసిన సీసీటీవీ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని జేమ్స్ కాన్వే చెప్పారు.డిసెంబర్ 14 గురువారం సాయంత్రం, డిసెంబర్ 15 శుక్రవారం తెల్లవారుజామున మార్ష్ వాల్ ప్రాంతంలో ఎవరైనా అతన్ని చూసి వుండే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు