జంతు ప్రవృత్తి .. ఇదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ !

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి కొత్త టర్న్ తీసుకుంది.ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఇటు రెండు మారుతూనే ఉంది.

 Bobby Deol Upcoming Movies , Bobby Deol, Animal, Sandeep Reddy Vanga, Ranbir Kap-TeluguStop.com

దాంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారుతుంది.అందుకే ఒక టైం లో థ్రిల్లర్స్ సినిమాలు హైలైట్ అవుతాయి, మరికొన్ని సందర్భాల్లో ప్రేమ కథలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి మరోసారి దయ్యాల కథలు ఎగబడి చూస్తున్నారు.

ఇక ఇప్పుడైతే పూర్తిగా జంతు ప్రవృత్తి అంటే క్రూరంగా ప్రవర్తించే నేచర్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా అభిమానిస్తున్నారు.అలా ట్రెండు మారిన ప్రతిసారి ఆ తరహా సినిమాలే పుట్టుకొస్తూ ఉంటాయి.

ఉదాహరణకు ఈ మధ్యకాలంలో వచ్చిన ఆనిమల్( Animal ) సినిమానే తీసుకుందాం.ఈ సినిమా ఒక బోల్డ్ అండ్ వాయిలెన్స్ తో కూడా చిత్రంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకు పోయింది.

Telugu Animal, Bobby Deol, Kangua, Ranbir Kapoor, Sandeepreddy-Telugu Top Posts

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )హీరోగా నటించగా, ఎంత పెద్ద హీరో ఉంటే అంతే స్థాయిలో ఉండే విలన్ ప్రతి సినిమాకి అవసరం.అప్పుడే బ్యాలెన్స్ గా సినిమా కనిపిస్తుంది.అందుకే రణబీర్ కపూర్ కి విలన్ గా బాబి డియోల్( Bobby Deol ) ని రంగంలోకి దింపి సందీప్ ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు.అసలే ఎటు వెళ్తుందో ఏమో తెలియని పరిస్థితిలో ఉంది బాబి డియోల్ కెరియర్.

ఆ టైంలో ఆనిమల్ సినిమా అతడికి కొత్త ఉత్సాహాన్ని కల్పించింది అలాగే కొత్త అవకాశాలు కూడా అతనిని వెతుక్కుంటూ వస్తున్నాయి.

Telugu Animal, Bobby Deol, Kangua, Ranbir Kapoor, Sandeepreddy-Telugu Top Posts

ఆనిమల్ సినిమాలోని బాబి డియోల్ పాత్ర ఎంత వాయిలెన్స్ తో కూడిన విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పాత్ర హిట్ కావడంతో అతనికి వెతుక్కుంటూ మరికొన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి.తమిళ హీరో సూర్య సినిమా అయినా కంగువాలో కూడా అదే రకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలో బాబి నటిస్తుండగా, తెలుగులో హరిహర వీరమల్లు మరియు నందమూరి బాలకృష్ణ 109వ సినిమాలో కూడా బాబి నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube