నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) మరో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న బాలయ్య ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
హ్యాట్రిక్ విజయాలతో బాలయ్య ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహ పరిచాడు.

దీంతో బాలయ్య బాబు నెక్స్ట్ సినిమాలపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా నెక్స్ట్ చేస్తున్న సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.బాలకృష్ణ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ‘‘NBK109” సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ ( Bobby Deol ) కన్ఫర్మ్ అయ్యిన విషయం తెలిసిందే.మరి తాజాగా ఈ సినిమాలో బాబీ డియోల్ జాయిన్ అయినట్టు తెలుస్తుందిదీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







