మహిళలలో మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే..!

ముత్రాశయం( Bladder ) లైనింగ్ కణజాలంలోనీ కొన్ని కణాలు మారినప్పుడు లేదా పరివర్తన చెందినప్పుడు మూత్రాశయ క్యాన్సర్( Bladder Cancer ) అభివృద్ధి చెందుతూ ఉంటుంది.

మూత్రాశయంలోని కణితులు విస్తరించి అసహజ కణాలుగా మారుతుంది.

మూత్రశయ గోడల ద్వారా సమీపంలోని శోషరస కణుపులకి వ్యాపించే అవకాశం ఉంది.తర్వాత అది ఎముకలు, ఊపిరితిత్తులు లేదా కాలయానికి చేరుతుంది.

పురుషులు, మహిళలు ఇద్దరికీ మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణంగానే ఉంటాయి.అయితే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స చేయడంలో మహిళలకి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

మహిళలలో మూత్రశయ క్యాన్సర్ లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మూత్రశయ క్యాన్సర్ అత్యంత సాధారణ సంకేతాలలో ముఖ్యమైనది మూత్రంలో రక్తం రావడం.

Advertisement

అయితే ఈ మూత్రం విసర్జనలో రక్తం( Blood ) పడితే కచ్చితంగా ఈ క్యాన్సర్ అని గ్యారంటీ లేదు.అలాగే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు.

ఈ లక్షణం అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జరుగుతుంది.కానీ ఇదే కొనసాగితే మాత్రం వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి( Pain ) బాధ కలుగుతుంది.నిరంతరం ఇలాగే ఉంటే మూత్రశయ క్యాన్సర్ తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు.మూత్రశయ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలు వారి మూత్రశయం నిండుగా లేనప్పటికీ ఆకస్మాత్తుగా మూత్ర విసర్జన చేస్తారు.

ఇది రోజువారి జీవనానికి అంతరాయం కలిగిస్తుంది.క్యాన్సర్ నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్యాన్సర్ వృద్ధి తగ్గాలంటే ధూమపానం చేసే మహిళలు మానేయాలి.

Advertisement

నికోటిన్( Nicotine ) వ్యాసనాన్ని అధిగమించడానికి చికిత్స తీసుకోవడం మంచిది.అలాగే క్రమం తప్పకుండా ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి.ఇది మూత్రశయం నుంచి క్యాన్సర్ కారకాలను బయటకి పంపించేందుకు ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ కణాలను తొలగించడానికి కీమోథెరపీ అవసరం ఉంటుంది.

తీవ్రమైన పరిస్థితులలో చికిత్స చేసేందుకు ఇంట్రావీనస్ కీమోథెరపీ కూడా చేస్తారు.

తాజా వార్తలు