ఆ రెండు పార్టీలతో పొత్తు కు బీజేపీ ప్లాన్  ? 

తెలంగాణలో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంతో బిజెపి ఉంది. బీఆర్ఎస్,  కాంగ్రెస్ ( BRS Congress )ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నా,,  కచ్చితంగా తెలంగాణలో హాంగ్ ఏర్పడే అవకాశం ఉందని బిజెపి అంచనా వేస్తోంది .

 Bjp's Plan For An Alliance With Those Two Parties , Telangana Bjp, Telangana-TeluguStop.com

హంగ్ ఏర్పడినా, బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మకంగా చెబుతూ ఉండడం తో , అదెలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే పొత్తుల ద్వారా అధికారంలోకి రావాలనే ప్లాన్ తో బీజేపీ ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఇప్పటికే జనసేనతో ఏపీలో బిజెపి( BJP ) పొత్తు పెట్టుకుంది.దానిని తెలంగాణ వరకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఇక బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా , బిజెపి అగ్రనేతలు టిడిపి ( TDP )విషయంలో అంత సానుకూలంగా లేరు.అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ టిడిపితో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంలో బిజెపి నేతలు ఉన్నారట.

Telugu Brs, Janasena, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics

ఈరోజు నామినేషన్లకు చివరి రోజు.దీంతో పొత్తుల వ్యవహారంపై ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఈరోజే సీట్ల సర్దుబాటు కూడా చేసుకుంటారని సమాచారం .ఇది వాళ్ళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కిషన్ రెడ్డితో సమావేశం అయ్యి పొత్తులపై చర్చలు జరిపారు.బిజెపి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లే కన్నా , జనసేన , టిడిపిని( Janasena TDP ) కలుపుకుని వెళ్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయని బిజెపి నేతలు భావిస్తున్నారు.

Telugu Brs, Janasena, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics

బీఆర్ఎస్ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్న వారంతా తమ వైపు చూస్తారని , అలాగే ఇటీవల చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తెలంగాణలోనూ టిడిపి యాక్టివ్ అయిందని టిడిపి సానుభూతిపరులంతా బిజెపి వైపు వస్తారని,  ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట .అందుకే జనసేన,  టిడిపి సానుభూతిపరుల ఓట్లను బిజెపి వైపుకు డైవర్ట్ చేసేందుకు ఆ రెండు పార్టీలతో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచార

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube