లక్ష ఓట్లే బీజేపీ లక్ష్యం ! మునుగోడు పై స్పెషల్ ఫోకస్

త్వరలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ లు పోటా పోటీగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ బలమైన అభ్యర్థిన రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తుండగా, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పోటీకి దించుతోంది.

ఇక టిఆర్ఎస్ సైతం బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది.ఈ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.       ఎన్నికల్లో లక్ష ఓట్లను బిజెపి మెజార్టీగా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బిజెపికి కేవలం 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి.బిజెపి ఉపాధ్యక్షుడిగా ఉన్న గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేశారు.

ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 97,239 ఓట్లు వచ్చాయి.ఇక టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 74,687 కోట్లు దక్కాయి.2018లో ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే నడిచింది.అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి పోటీ చేస్తుండడంతో, త్రిముఖ పోటీ నెలకొంది.

నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఇమేజ్ తో పాటు, బీజేపీ కి ఉన్న సాంప్రదాయ ఓట్లు అన్నీ కలిస్తే లక్ష ఓట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అన్న లెక్కల్లో బిజెపి ఉంది.   

Advertisement

  ఇప్పుడు ఆ లక్ష ఓట్లను సాధించడం పైనే బిజెపి టార్గెట్ పెట్టుకుంది.ప్రస్తుతం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువగా ఉండడంతో, అదే తమకు కలిసి వస్తుందని ఆ పార్టీలోని అసంతృప్తి నాయకులు బిజెపికి ఓటు వేయించుతారనే నమ్మకంతో ఉంది.ఈనెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం , దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కావడం, పెద్ద ఎత్తున ఎదర పార్టీల నాయకులు బిజెపిలో చేరబోతుండడంతో జనాలలోను బిజెపిపై ఆదరణ పెరుగుతుంది అనే నమ్మకం తో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

ఎన్నికల టిఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకతను పెంచే విధంగా బిజెపి వ్యూహాలు రచిస్తోంది.కాంగ్రెస్ ను దెబ్బతీయడం పెద్ద కష్టమేమి కాదని ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలే ఆ పార్టీని ఓడిస్తాయని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని అది తమకు కలిసి వస్తుంది అని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు