తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు కిచ్చా సుదీప్( Kiccha Sudeep ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు కిచ్చా సుదీప్.
ఈగ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.తెలుగులో సుదీప్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటుడిగా విలన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
కాగా సుదీప్ కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత సినీ రచయిత కూడా.
ఇది ఇలా ఉంటే కిచ్చా సుదీప్ గత ఏడాది విక్రాంత్ రోణా( Vikranth Rona ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కిచ్చా సుదీప్ సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.ఆ వివరాల్లోకి వెళితే.కర్ణాటక లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది.వచ్చే నెల 10వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Elections ) జరగనున్నాయి.
ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ( BJP ) గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది.మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఉంది.

కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి.ఈసారి ఎలా అయినా గెలవడం కోసం సినిమా సెలబ్రిటీలను కూడా రాజకీయాలలోకి తీసుకురానుంది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ కన్నడ హీరో అయినా కిచ్చా సుదీప్ కి జెండా కప్పనుంది.హీరో సుదీప్ అలాగే అగ్ర హీరో దర్శన్ బిజెపిలో చేరనున్నారు.కర్ణాటకలో వీరిద్దరూ కూడా పెద్ద హీరోలే.అంతేకాకుండా ఈ ఇద్దరు హీరోలకు మాస్ ఫాలోయింగ్ ఉంది.

హీరో సుదీప్ కి కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.కర్ణాటకలో అంబరీష్ వంటి స్టార్స్ రాజకీయ నాయకులుగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.అంబరీష్ భార్య ప్రముఖ నటి సుమలత కూడా బిజెపిలోకి చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలతో ప్రచారం చేయించడం, హీరోలను తమ పార్టీలోకి తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అని బిజెపి భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే హీరో కిచ్చా సుదీప్ పేరు మారుమోగుతోంది.







