అర్హులకు పథకాలు అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ తాంత్రిక పూజలు మొదలు పెట్టారని విమర్శించారు.
ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడానికి పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.కాంగ్రెస్ లో కేసీఆర్ కులచిచ్చు పెట్టించారని మండిపడ్డారు.
ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులు అందరికీ టికెట్లు రావని తెలిపారు.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్లను కూడా చేర్చుకోవాలని కదా అని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పుడు జరిగినా బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







