తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం కీలక నియామకాన్ని ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ ఇంఛార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను నియమిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ప్రస్తుతం సునీల్ బన్సల్ బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా.
తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.దాంతో పాటు తెలంగాణ పార్టీ శాఖ ఇంఛార్జీ బాధ్యతలతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా శాఖల ఇంఛార్జీగానూ నియమించారు.







