గవర్నర్ ను కలిసిన బీజేపీ బృందం.. పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) మరియు కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు రాజభవన్ లో గవర్నర్ తో బేటి అయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై వివరాలు కోరుతూ గవర్నర్ కి వినతి పత్రం అందించారు.

అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడటం జరిగింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వివరాలు కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు( Governor Abdul Nazeer ) 13 అంశాలతో వినతిపత్రం అందించినట్లు స్పష్టం చేశారు.

కార్పొరేషన్ ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని విమర్శలు చేశారు.

కేంద్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.దీంతో గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్ కి బిల్లులు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు.ఆఖరికి మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) అప్పు తెచ్చుకుందని విమర్శించారు.

Advertisement

కార్పొరేషన్లు వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరినట్లు పురందేశ్వరి మీడియాతో మాట్లాడటం జరిగింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి పై విపక్షాలు మొదట నుండి విమర్శలు అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.ఏపీ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు