ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొత్ చర్చ జరుగుతోంది.అదే టీడీపీ,బీజేపీ మధ్య మళ్లీ కొత్త స్నేహం చిగురించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు.
ఎందుకంటే ఇటీవల జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.అంతేకాకుండా ప్రధాని మోడీ చంద్రబాబుతో అప్యాయంగా మాట్లాడారని టాక్ వినిపించింది.ఇక సెప్టెంబర్ నెలలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడితో మోడీ అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది.
కొత్త దోస్తీతో ఎవరికి లాభం.
గత 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగాయి.ఆ టైంలో చంద్రబాబు సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత కొంతకాలానికే ఈ పొత్తు పొద్దు పొడిసింది.చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోడీని, కేంద్రాన్ని ఘోరంగా విమర్శించారు.
అసెంబ్లీ వేదికగా ప్రధాని వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు.ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది.

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే బీజేపీతో పొత్తు అనివార్యం అని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.ఎందుకంటే వైసీపీ బలం ముందు బాబు బలం సరిపోదని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారట.ఇక బీజేపీ కూడా సౌత్ నుంచి ఎక్కువగా ఎంపీ సీట్లు ఆశిస్తోంది.వైసీపీతో పొత్తు బీజేపీకి మేలు చేయదు.టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికసంఖ్యలో ఎంపీ సీట్లు అడగాలని మోషా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.బాబు కూడా 13 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

వీరిద్దరూ ఏపీలో మళ్లీ కలిసి పోటీచేస్తే ఇరు పార్టీలకు మేలు జరుగవచ్చని అంటున్నారు.ఇక జనసేన కూడా కలసి వస్తే 2014 ఫలితాలను తిరిగి పొందవచ్చని అనుకుంటున్నారు.కానీ బాబు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.మళ్లీ అధికారంలోకి వచ్చాక తన బుద్దిమార్చుకుంటే ఎంటనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు బాబు ముందు ఎలాంటి కండిషన్స్ పెట్టనున్నారు.బాబు కూడా వారి ముందు ఎలాంటి కండిషన్స్ పెట్టునున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు పొడిస్తే వైసీపీకి మాత్రం గట్టి పోటీ ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.